fire accident in kphb colony hyderabad

కేపీహెచ్‌బీలో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ కాలనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ టిఫిన్ సెంటర్‌లో అర్ధరాత్రి ఒక్కసారిగా చెలరేగిన మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, హోటల్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

మరోవైపు కనుమ పండుగ వేళ ఖమ్మం పత్తి మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి మార్కెట్‌ యార్డ్‌ షెడ్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్‌లో నిల్వచేసిన పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ అగ్నిప్రమాదంలో మర్కెట్‌ గోడౌన్‌లో ఉంచిన 400 పత్తి బస్తాలు మంటల్లో దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే పత్తి మార్కెట్‌కు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16 వరకు సెలవులు ఉన్నాయి. పండుగకు ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసి మార్కెట్ యార్డులో ఉంచారు. కానీ ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పత్తి బస్తాలు కాలిపోవడంతో వ్యాపారులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.

అగ్నిప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పత్తి బస్తాలు దగ్ధమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం జరగడంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు తమను ప్రభుత్వం ఆదుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు.

Related Posts
Smart Phone : సమ్మర్లో మీ ఫోన్ వేడెక్కుతోందా?
Smart phone heat

సమ్మర్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ముఖ్యంగా మనం రోజూ ఉపయోగించే మొబైల్ ఫోన్లు వేడెక్కే సమస్యకు గురవుతుంటాయి. నేరుగా సూర్యకాంతి ఫోన్పై పడితే, పరికరం Read more

కలెక్టర్ మీటింగ్ లో రమ్మీ ఆడిన DRO.. ఏంటి సర్ ఇది..?
DRO rummy

అనంతపురం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోలా వ్యవహారం కలకలం రేపింది. ఎస్సీ వర్గీకరణ సమస్యలపై ఏకసభ్య కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ Read more

కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు
కుటుంబ సమేతంగా భారత్ రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు

యూఎస్ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు ఆయన భార్య ఉష వాన్స్ త్వరలోనే భారత్ పర్యటనకు రానున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెలలోనే ఈ Read more

‘దొండ’తో ఆరోగ్యం మెండు!
Ivy Gourd Health Benefits

దొండకాయను ప్రతిరోజూ ఒక కప్పు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పుష్కల పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయలో ఉండే విటమిన్లు, ఖనిజాలు Read more

×