తెలుగు, కన్నడ బుల్లితెర సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందిన నటుడు చరిత్ బాలప్ప ప్రస్తుతం పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. లైంగిక వేధింపులు, బెదిరింపుల ఆరోపణలపై బెంగళూరు ఆర్ఆర్ నగర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బాధిత యువతి ఫిర్యాదు ప్రకారం, చరిత్ ప్రేమిస్తున్నానని చెప్పి తన నమ్మకాన్ని దుర్వినియోగం చేశాడు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడి, తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అంతేకాదు, డబ్బులు ఇవ్వకుంటే అవి లీక్ చేస్తామని బెదిరించినట్లు తెలిపింది. చరిత్ తన సహచరులతో కలిసి బాధితురాలి ఇంట్లోకి చొరబడినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ యువతి తీవ్ర ఆందోళనకు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.చరిత్ బాలప్పకు 2017లో నటి మంజునితో వివాహం జరిగింది.
కానీ వారి మధ్య విభేదాలు పెరిగి 2022లో విడాకులు తీసుకున్నారు.విడాకుల అనంతరం కూడా అతను తన మాజీ భార్యను బెదిరించినట్లు జూన్‌లో సర్జాపూర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది.కోర్టు ఆదేశాల ప్రకారం డైవర్స్ పరిహారం కోసం నోటీసు పంపినందుకు కూడా చరిత్ తన మాజీ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కన్నడ సినీ ఇండస్ట్రీలో చరిత్ బాలప్పపై వచ్చిన ఈ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపుల కేసులతో అతని పేరు పరిశ్రమలో నెగటివ్‌గా మారింది.తెలుగు, కన్నడ బుల్లితెరపై తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న చరిత్ ఇప్పుడు ఈ కేసుల కారణంగా తీవ్ర విమర్శలకు గురవుతున్నాడు. అతని ఫ్యాన్ బేస్ కూడా ఈ ఘటనల తర్వాత చర్చలో పడింది.పోలీసులు ప్రస్తుతం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో పాటు చరిత్ గత ఆచరణలను పరిశీలిస్తున్నారు. ఈ వివాదాలు చరిత్ కెరీర్‌పై గాఢమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.