winter

పెరిగిన చలి మైనస్ లో ఉష్ణోగ్రత

డిసెంబర్ మాసం అంటేనే చలి వణికిస్తుంది. అయితే ఇటీవల అల్పపీడన ప్రభావంతో చలిలో తీవ్ర మార్పులు వస్తున్నాయి. ఒక్కసారిగా చలి విపరీతంగా పెరిగింది. దీనికి కారణం హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది. చంటి పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది. రాజస్థాన్‌లోని చురు- 3.1, పంజాబ్ అమృత్‌సర్- 3.8, రాజస్థాన్ పిలానీ- 4.0, ఉత్తరప్రదేశ్ సర్సవా- 4.1, పంజాబ్ హల్వారా ఐఎఎఫ్- 4.1, రాజస్థాన్ ఉత్తర్‌లై ఐఎఎఫ్- 4.2, హర్యానా భివానీ- 4.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్- 4.6, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్- 4.7, మధ్యప్రదేశ్ ఉమేరియా- 4.8, ఉత్తరప్రదేశ్ బరేలీ- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

Related Posts
Chhattisgarh: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్-16మంది నక్సల్ హతం!
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- 16మంది నక్సల్ హతం!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. Read more

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా
Amit Shah ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా

Amit Shah : ఇందిరాగాంధీ హయాంలో తనను జైల్లో పెట్టారన్న అమిత్ షా ఇందిరా గాంధీ పరిపాలనలో తనకు వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఉద్యమం నిర్వహించారని, ఆ Read more

తొక్కిసలాట ఘటనపై స్పందించిన రైల్వే
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట.

ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (CPRO) హిమాన్షు శేఖర్ స్పందించారు. రైల్వే స్టేషన్‌లో 14, 15వ ప్లాట్‌ఫాంల వైపు Read more

ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?
ఉగ్రవాద నాయకుల భేటీ ఎందుకు?

పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లో ఉగ్రవాద నాయకుల సమావేశం జరిగింది ఈ భేటీలో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) అగ్ర కమాండర్లు అలాగే హమాస్ ప్రతినిధులు Read more