TSRTC luxury buses

పండగవేళ ఆర్టీసీ బస్సుల దోపిడి

పండగ పూట ఇంటికెళ్లేందుకు నగర ప్రజలంతా పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం మోత మోగిస్తోందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించటంతో.. ఒక రోజు ముందు జనవరి 10 నుంచే బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గురువారం నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను నడిసపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచేసి.. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

ఈ మేరకు సోషల్ మీడియాల్లో బస్సు టికెట్లను ప్రయాణికులు షేర్ చేస్తే.. సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బాదుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సంక్రాంతికి స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.

ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ.100 ఉంటే.. ఇప్పుడు రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఫొటో తీసి మరీ పోస్ట్ చేశాడు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశాడు.

మరోవైపు.. ఈ దారిదోపిడి సాధారణ ప్రయాణికుల దగ్గరే కాదు.. దివ్యాంగుల దగ్గర కూడా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
ఏపీలో రేషన్​కార్డుదారులకు గుడ్​న్యూస్​ ..
ap ration shop

ఏపీలో రేషన్​కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ లో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రేషన్​ దుకాణాల్లో నేటి (అక్టోబర్​ Read more

తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ముందంజలో బీజేపీ
Counting of MLC votes in Telangana.. BJP in the lead

హైదరాబాద్‌: కరీంనగర్‌-నిజామాబాద్‌-మెదక్‌-ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 9 రౌండ్ల ఫలితాలు వెలువడ్డాయి. తొమ్మిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి Read more

కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల లేఖ
thummala

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ Read more

ఫార్ములా-ఈ కేసు..లొట్టపీసు కేసు – కేటీఆర్
KTR e race case

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇటీవల ఫార్ములా-ఈ-కార్ కేసులో ఢిల్లీ ఈడీ నుంచి నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నోటీసులపై ఆయన తీవ్రంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *