...
keerthi suresh

నేను సింగిల్ అని చెప్పానా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది

ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ కమెడియన్‌ను వివాహం చేసుకుందని, లేదా ఒక ప్రముఖ నిర్మాతతో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా, తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉందని కూడా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ అన్ని వార్తలు పుకార్లే అని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం కీర్తి తన కెరీర్‌పై దృష్టి సారించింది, ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో రాబోతున్న రఘు తాత అనే సినిమాలో నటిస్తూ, ఆగస్టు 15న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు కీర్తి సరదాగా సమాధానాలు ఇచ్చింది. ఒక విలేకరి మీరు ఇంకా సింగిల్‌గా ఉండటంతో బోర్ అనిపించడం లేదా అని ప్రశ్నించగా, కీర్తి నవ్వుతూ “నేను సింగిల్ అని ఎక్కడా చెప్పలేదు కదా అంటూ చమత్కరించింది. ఈ వ్యాఖ్యతో, ఆమె నిజంగా రిలేషన్‌లో ఉందా లేదా అన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ, కీర్తి తన ప్రాధాన్యత సినిమాలపైనే ఉందని, తగిన సమయాన తన పెళ్లి వార్తను అందరితో పంచుకుంటానని స్పష్టం చేసింది. పెళ్లి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లను ఆమె సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ఇంకా, కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కూడా తన ప్రవేశం కోసం సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్‌లో బేబీ జాన్ అనే సినిమాలో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి రొమాంటిక్ సీన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వారిద్దరి మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts
Pushpa 2 The Rule | ఆర్‌ఆర్‌ఆర్‌ను ఫాలో అవుతున్న అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్‌ టీం.. ఇంతకీ ఏ విషయంలోనంటే.
pushpa 2

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం పుష్ప 2 ది రూల్ 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ Read more

బచ్చల మల్లి టీజర్ .. అల్లరోడిలో మరో యాంగిల్..!
bachhala malli

అల్లరి నరేష్ కెరీర్ ప్రస్తుతం ఒక విభిన్న దిశలో సాగుతోంది, అతను ఏ దిశలో తన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆలోచనలో ఉన్నట్లుంది. ఒకవైపు వినోదానికి ప్రాధాన్యం ఇచ్చే Read more

Devi Sri Prasad: మందు సేవించడం అనేది ఒక వ్యసనం: దేవిశ్రీ ప్రసాద్
Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్: మద్యం అలవాటుపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో పాల్గొని మద్యం అలవాటుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు సంగీత ప్రేమికులు, సినీ Read more

టికెట్ల రేట్లను పెంచడం.. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమే : నారాయణ
Increasing the ticket rates is encouraging the black market.. Narayana

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ ప్రముఖలు కలవనున్నారు. ఈభేటీ సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే… Read more

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.