manchu

త్వరలో జనసేన పార్టీలోకి మంచు మనోజ్, మౌనిక?

ఇటీవల కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని చెపుతున్నారు. జనసేనలో వారు చేరుబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ, మౌనిక కానీ ఇంకా స్పందించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా సోమవారం మోహన్ బాబు హైద‌రాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం రంగంపేట‌లోని త‌న యూనివ‌ర్సిటీకి వెళ్లారాయ‌న‌. అనంత‌రం చంద్ర‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో త‌న డ‌బుల్ బ్యారెల్‌ లైసెన్స్‌డ్ గ‌న్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవ‌ల కుటుంబ గొడ‌వ‌ల నేప‌థ్యంలో గ‌న్ స‌రెండ‌ర్ చేయాల‌ని హైద‌రాబాద్ పోలీసులు ఆయ‌న్ను ఆదేశించ‌డంతో తాజాగా గ‌న్ అప్ప‌గించారు.
మంచు మనోజ, మౌనికలు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో మరోసారి ఈ ఫ్యామిలీ వార్తలో నిలిచింది.

జ‌ల్‌ప‌ల్లిలో త‌న నివాసం వద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌పై మోహ‌న్ బాబు తాజాగా మ‌రోసారి మాట్లాడారు. తాను ఉద్దేశ‌పూర్వ‌కంగా జ‌ర్న‌లిస్టుపై దాడి చేయ‌లేద‌న్నారు. ఈ సందర్భంగా మ‌రోసారి జ‌ర్న‌లిస్టుల‌ను ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయ‌ప‌డిన జ‌ర్న‌లిస్టును ఆసుప‌త్రికి వెళ్లి మోహ‌న్ బాబు, ఆయ‌న కుమారుడు మంచు విష్ణు ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే.

Related Posts
కులగణన నివేదిక ఫేక్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ
teenmar mallanna

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కులగణన నివేదికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ Read more

Telangana: తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..
Telangana: తెలంగాణలో నేటి నుంచి వేసవి సెలవులు..

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. మార్చి 30 నుంచి జూన్ 1 వరకు దాదాపు రెండు నెలలపాటు ఇంటర్ Read more

దుబాయ్ లో ‘దేవర’ సక్సెస్ సంబరాలు
devara succss celebrations

దుబాయ్ లో దేవర సక్సెస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఎన్టీఆర్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో వచ్చిన మూవీ దేవర. రిలీజ్ కు ముందు భారీ Read more

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
mlc naveen

పెను ప్రమాదం నుండి బయటపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇటీవల రోడ్డు ప్రమాదాలు అనేవి అనేకం అవుతున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునేవరకు Read more