OG update

‘ఓజి’ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్

గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రీసెంట్‌గా ఆగిపోయిన తన సినిమాల షూటింగ్లను తిరిగి మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ‘ఓజి’ మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ‘హరిహర వీరమల్లు’ కంటే ‘ఓజి’ మూవీ అప్డేట్స్ కోసమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisements

తాజాగా ‘ఓజి’ కి సంబదించిన క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతుంది. సాహో ఫేమ్ సుజిత్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పవర్​ ఫుల్​ గ్యాంగ్​స్టర్​ యాక్షన్ మూవీని పాన్‌ ఇండియా చిత్రంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమాలోని తొలి సాంగ్ ను రిలీజ్ చేసేందుకుమేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది.

కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ఈ సాంగ్​ను విడుదల చేస్తారని సమాచారం. వాస్తవానికి సెప్టెంబరు 2న పవన్‌ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగానే ఈ ఫస్ట్ సాంగ్​ను రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కుదరలేదు. ఎందుకంటే అప్పటికీ ఏపీలో ఉన్న వరదల పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేయలేదు. ఇప్పుడా సాంగ్​నే కొత్త ఏడాది రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాలో పవన్‌ కల్యాణ్ ఓజాస్‌ గంభీర అనే పవర్​ ఫుల్​ పాత్రలో కనిపించనున్నారు. ఆయన్ని ఢీకొట్టే ప్రతినాయకుడిగానే ఇమ్రాన్‌ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది. సినిమాకు తమన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో కోలీవుడ్‌ స్టార్ హీరో శింబు కూడా ఓ పాట పాడారు.

Related Posts
ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’
Sankranthikivasthunnam50day

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా Read more

Anchor Pradeep : ‘అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి’ అనే రెండో సినిమాతో వ‌స్తున్న యాంక‌ర్‌ ప్ర‌దీప్
Anchor Pradeep 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి' అనే రెండో సినిమాతో వ‌స్తున్న యాంక‌ర్‌ ప్ర‌దీప్

Anchor Pradeep : 'అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి' అనే రెండో సినిమాతో వ‌స్తున్న యాంక‌ర్‌ ప్ర‌దీప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు సినీ ప్రపంచంలో తన ప్రయాణాన్ని Read more

కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీలో సమంత ప్రభావం
కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీలో సమంత ప్రభావం

కీర్తి సురేష్ బాలీవుడ్‌లో తన అరంగేట్రం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. కలీస్ దర్శకత్వం వహించిన మరియు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ Read more

తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్
తండేల్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్

నాగ చైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం 'తండేల్' ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ప్రొమోట్ చేసేందుకు చిత్ర యూనిట్ వివిధ Read more

×