YS Sharmila criticism of Botsa Satyanarayana

బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది : షర్మిల

తనపై బొత్స చేసిన కామెంట్స్‌పై షర్మిల కౌంటర్‌

అమరావతి: వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆయన మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో పని చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకుతిన్నది ఎవరో ప్రజలకు తెలుసు అని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు జైలుకు వెళ్లి ఖైదీలను పరామర్శించడానికి సమయం ఉందిగానీ.. శాసన సభకి వెళ్ళడానికి ధైర్యం లేదు అని నిన్న షర్మిల చేసిన కామెంట్స్‌పై బొత్స స్పందిస్తూ ఆమెకు పని లేదు.. ఖాళీగా కూర్చొని ట్వీట్‌లు పెట్టేదానికి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ తేలిగ్గా తీసిపారేశారు.

Advertisements
బొత్స మాటలు వింటుంటే దెయ్యాలు

చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు షర్మిలకు కనిపించవని..ఎంతసేపు మాజీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించమే పనిగా పెట్టుకుందని బొత్స విమర్శించారు. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో… రాష్ట్ర ప్రజానీకానికి తెలుసంటూ జగన పాలనపై మరోసారి షర్మిల నిప్పులు కక్కారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారని..పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారని..151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని..చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారని షర్మిల గుర్తు చేశారు.

ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

కాగా, ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా జగన్ కు గుంటూరు లో భద్రత కల్పించకపోవటం పైన వైసీపీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ఈ సారి అసెంబ్లీకి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదు. ఇదే అంశం పైన పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. తన పైన వ్యాఖ్యలు చేసిన బొత్సాకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైసీపీని సవాల్ చేసారు.

Related Posts
కృష్ణా జలాల పంపిణీపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం
కృష్ణా నీటి పంపిణీపై తెలుగు రాష్ట్రాల ఘర్షణ1

కృష్ణా నది నీటి పంపిణీపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోంది. కృష్ణా జలాలను పంచుకోవడంపై తెలంగాణ రాష్ట్ర నిరసనలు మరింత ముదిరాయి. ప్రస్తుతం 66:34 నిష్పత్తి Read more

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం
Bangkok Earthquake భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Bangkok Earthquake : భూకంప తృటిలో తప్పించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం నుంచి తృటిలో బయటపడి తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ Read more

ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?
ఏపీలో ఇంటర్ తరగతులు ఎప్పటినుంచంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 1న ప్రారంభించేందుకు అకడమిక్ క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. ఇందులో విద్యార్థులకు అవసరమైన అన్ని వివరాలను పొందుపరిచారు. కొత్త Read more

20 లక్షల మందికి ఉపాధి: చంద్రబాబు
chandra babu

తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతేకాక కొత్త ఏడాదిలో రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని Read more