ఒక టీవీ చర్చా కార్యక్రమంలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహం రేపాయి. ప్రముఖ జర్నలిస్టులు (Journalists) వివిఆర్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులు అమరావతి మహిళల (Amaravati Women’s) పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు గట్టిగా స్పందించారు.సాక్షి ఛానెల్‌లో ప్రసారమైన “లైవ్ విత్ కేఎస్ఆర్” డిబేట్‌లో జరిగిన ఈ వివాదం పెద్ద దుమారమే రేపింది. డిబేట్‌లో పాల్గొన్న కృష్ణంరాజు, శ్రీనివాసరావులు అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మహిళలను “వేశ్యలు” అంటూ కించపరిచే పదజాలం వాడారని ఆగ్రహం వ్యక్తమైంది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆగ్రహానికి గురైన మహిళలు, ఇద్దరు జర్నలిస్టుల ఫొటోలపై చెప్పులతో కొట్టారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై ఖండనల జల్లు కురిపించారు. “ఇలాంటి మాటలు మాట్లాడిన వారికి మన సమాజంలో స్థానం లేదు” అంటూ నినాదాలు చేశారు.
సాక్షి ఛానెల్ తీరుపై తీవ్ర విమర్శలు
కేవలం వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులపై మాత్రమే కాదు, ఈ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేసిన సాక్షి ఛానెల్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను అవమానించేలా ప్రసారం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన సమయంలో మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఆక్రోశం పెరుగుతోందా?
ఈ ఘటనతో అమరావతిలో మహిళలు మరింత చైతన్యంతో రోడ్లపైకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు మీడియా స్వేచ్ఛ పేరుతో కవర్ చేయలేమని, బాధ్యతాయుతమైన ప్రసారాలు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Eknath Shinde : పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు : ఏక్‌నాథ్