Where did the Center say that MP seats will decrease with delimitation.. Etela Rajender

Etela Rajender : డీలిమిటేషన్‌తో ఎంపీ సీట్లు తగ్గుతాయని కేంద్రం ఎక్కడ చెప్పింది : ఈటల

Etela Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రాంతీయ పార్టీల వలే కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోందని ఈటల మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదని, అందుకు ఎలాంటి విధివిధానాలను కూడా ఖరారు చేయలేదన్నారు. అఖిలపక్ష భేటీతో విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.

డీలిమిటేషన్‌తో ఎంపీ సీట్లు తగ్గుతాయని

ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దు

డీలిమిటేషన్‌తో తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గుతాయని జరగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు కానీ, తగ్గే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపాదిక ఏంటనే విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు.

పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

కాగా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పాల్గొన్నారు.

Related Posts
నేడు తెలంగాణ గ్రూప్‌-1 ఫలితాలు విడుదల
Telangana Group 1 results released today

హైదరాబాద్‌: తెలంగాణలో గ్రూప్స్ ఫలితాల విడుదలకు సంబంధించి షెడ్యూల్‌ను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. నేడు గ్రూప్‌-1,ఫలితాలను విడుదల చేయనున్నట్లు కమిషన్‌ తెలిపింది.మొత్తం 563 పోస్టులకు‌గానూ Read more

ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌
KTR traveled by auto to Indira Park

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. Read more

రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu introduced the agriculture budget with Rs.43402 crores

అమరావతి: ఏపీ అసెంబ్లీలో సోమవారం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని Read more

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం
Singareni agreement with Rajasthan Power Department

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ ముందడుగు కారణంగా సింగరేణి వ్యాపార విస్తరణలో మరో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతోంది. నేడు రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *