బలూచిస్తాన్‌లో నెత్తుటి యుద్ధం ముదురుతోంది. పాక్ సైన్యానికి, బలూచ్ తిరుగుబాటుదారులకు (BLA) మధ్య జరుగుతున్న ఈ భీకర పోరులో గత 40 గంటలుగా తుపాకుల మోత ఆగడం లేదు. అటు పాక్ ప్రభుత్వం, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. ఇద్దరూ భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పరస్పర ప్రకటనలు చేసుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రాంతం బలూచిస్తాన్(Balochistan)లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఆదివారం (ఫిబ్రవరి 1) నాటికి ఈ భీకర పోరు ప్రారంభమై 40 గంటలు గడిచింది. ఈ పోరులో ఇప్పటివరకు 145 మంది తిరుగుబాటుదారులను మట్టుబెట్టినట్లు బలూచిస్తాన్ ముఖ్యమంత్రి ప్రకటించగా, పాక్ సైన్యానికి తాము కోలుకోలేని దెబ్బ తీశామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పష్టం చేసింది.
Read Also: Gold Street : ప్రపంచంలోనే తొలిసారిగా గోల్డ్ స్ట్రీట్‌ను నిర్మిస్తున్న దుబాయ్

‘ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2’
బలూచ్ తిరుగుబాటుదారులు ‘ఆపరేషన్ హెరోఫ్ ఫేజ్-2’ పేరుతో పాక్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతున్నారు. ఖారన్, మస్తుంగ్, దల్బందిన్, టంప్, పస్నీ వంటి ప్రాంతాల్లో తమ లక్ష్యాలను పూర్తి చేసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లామని BLA ప్రకటించింది. క్వెట్టా, నోష్కీ వంటి కీలక నగరాల్లో పాక్ సైన్యం తోకముడిచి వెనక్కి వెళ్లేలా చేశామని వారు పేర్కొంటున్నారు.200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు చనిపోయారని, 17 మందిని బందీలుగా పట్టుకున్నామని BLA ప్రతినిధి జియాంద్ బలూచ్ తెలిపారు. తమ వైపు 18 మంది యోధులు మరణించారని వారు అంగీకరించారు. యుద్ధ క్షేత్రంలో మహిళా ఫిదాయీలు ఈసారి బలూచ్ పోరాటంలో మహిళా ఆత్మాహుతి దళాలు (Fedayeen) కీలకంగా మారడం చర్చనీయాంశమైంది.2023లో BLAలో చేరిన ఆసిఫా మెంగల్ అనే 24 ఏళ్ల యువతి, జనవరి 31న నోష్కీలోని పాక్ గూఢచారి సంస్థ ISI ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ‘కార్ బాంబు’ (VBIED) పేల్చింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.