బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం జనవరి 10, 2026న ఉత్తర శ్రీలంక తీరాన్ని ట్రింకోమలీ, జాఫ్నాల మధ్య మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పొడి వాతావరణంతోపాటు చలి తీవ్రత ఉంటుందని, అయితే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ (Weather) అలర్ట్ జారీ చేసింది.
Read Also: Pedda Shankarampet: ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్, యానములో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: