తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట చలి వణికిస్తోంది. ఇటీవల చాలా జాల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. అయితే.. రెండు రోజుల నుంచి చలి తీవ్రత కొంత మేర తగ్గింది. జనవరి నెల ప్రారంభంలో సాధారణ శీతాకాలం ఉన్నా, సంక్రాంతికి మళ్లీ చలి పెరిగి, చివరి వారం నుంచి తగ్గుముఖం పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Read also: Telugu States: నేడు సుప్రీంకోర్టులో జల వివాదాల కేసు విచారణ?
మంచు ప్రభావం ఎక్కువ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 9వ తేదీ నుంచి తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, ప.గో., NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: