Vijayawada Rains: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం ఉదయం విజయవాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఉరుముల వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి.
Read Also :AP weather alert: నేడు, రేపు భారీ వర్ష సూచన
నగరంలో స్తంభించిన ప్రయాణాలు
రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు కిక్కిరిసిన జంక్షన్లలో డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహన రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది.
Vijayawada Rains: కోస్తా తీరానికి బలమైనగాలులు – ఏపీఎస్డీఎంఏ (APSDMA) హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తర కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో, దక్షిణ కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని కఠినంగా ఆదేశించారు. శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని అధికారులు సూచించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :