తెలంగాణలో (TG Weather) ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి, తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఎండ తక్కువగా ఉండటం, రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణ (TG Weather) ప్రజలు గజగజలాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా.. సుమారు 25 జిల్లాల్లో 14 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి.
Read Also: Dec 31st : మందు బాబులకు కిక్క్ ఇచ్చే న్యూస్
చలి తీవ్రత
మంగళవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీలు నమోదు కాగా.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో డిసెంబర్ 26 వరకు ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: