ఆగ్నేయ బంగాళాఖాతం (Southeast Bay of Bengal) లో ఏర్పడిన అల్పపీడనంవాయుగుండంగా మారి.. ఆపై తుఫాన్ రూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (హైదరాబాద్ వాతావరణ కేంద్రం) స్పష్టం చేసింది.ఈ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు. వాయుగుండం తుఫాన్‌గా మారితే ‘మొంథా’గా ఐఎండీ పేరు పెట్టింది. రాష్ట్రంలో రాబోయే కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
TG GOVT: జాయింట్ కలెక్టర్ పోస్టు రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు తదితర పనులను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.నేడు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడవచ్చునని చెప్పారు. వచ్చే రెండు గంటల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తీవ్ర వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు.వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల నుంచి భుపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా తీవ్ర వర్షాలు విస్తరించే అవకాశం ఉందన్నారు.
నేడు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు
రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతాయన్నారు.హైదరాబాద్ నగరంలోనూ నేడు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉదయం వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు.
మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఒకటి లేదా రెండు సార్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలి. తదుపరి 1-2 గంటల్లో దక్షిణ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షాలు పడతాయని.. పశ్చిమ హైదరాబాద్‌లో వర్షాలు తగ్గి జల్లులుగా మారే అవకాశం ఉందన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: