📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

TG Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు కూడా భారీ వర్షాలు

Author Icon By Anusha
Updated: August 20, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత రెండు వారాలుగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం వర్షాల ప్రభావంతో అల్లాడిపోతోంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు జనజీవనం దెబ్బతింటోంది. రోడ్లు దెబ్బతిని రవాణా అంతరాయం కలుగుతున్నాయి. ముఖ్యంగా తక్కువ ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ (Rain alert) ప్రకటించారు. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగానే ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలోని భవానీపట్నానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావం తెలంగాణపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు.

రెడ్ అలర్ట్ జిల్లాలు

ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల (Inland areas) ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

TG Rains

ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు

నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోనూ వరద ముప్పు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రహదారులను ముంచెత్తాయి.లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు తరలివెళ్లాలి. అవసరమైతే అధికారుల సహాయం తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. వర్షాలు కురుస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని.. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరంలో మంగవారం జోరుగా వర్షం కురిసింది. సోమవారం అర్ధరాత్రి మెుదలైన వాన మంగళవారం ఉదయం వరకు కురిసింది. ఆ తర్వాతా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/highway-greenfield-highway-being-prepared/andhra-pradesh/532967/

Breaking News Hyderabad weather report latest news Telangana heavy rains Telangana Orange Alert Telangana rain alert Telangana red alert

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.