తెలంగాణలో వర్షాల ముప్పు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: తెలంగాణలో వర్షాల ముప్పు కొనసాగుతోంది. ఈ నెల అక్టోబర్ 26 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాలకు(TG) ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు (అక్టోబర్ 22) నుండి భద్రాద్రి కోత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి,(Yadadri Bhuvanagiri) రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
Read also: బంగాళాఖాతంలో వాయుగుండం భారీ వర్షాల హెచ్చరిక
వర్షాల నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు
ప్రజలు వర్షాలు, ఉరుముల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు పంటలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, గిరిజన ప్రాంతాల్లో(TG) నివసించే ప్రజలు లోతట్టు ప్రాంతాల నుంచి భద్రతగా ఉండే చోట్లకు తరలివెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
విద్యార్థులు, ఉద్యోగులు ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రభావం ఇంకా 3–4 రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: