📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Telangana Rains: వెంటాడుతున్న అకాల వర్షాలు

Author Icon By Tejaswini Y
Updated: February 26, 2026 • 12:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుండి మరాత్వాడ వరకు కొనసాగిన ద్రోణి వాయువ్య తమిళనాడు నుండి మధ్యా మహారాష్ట్ర వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.

Read also: Weather Update: ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Telangana Rains: Untimely rains haunting

మరో రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

ద్రోణి ప్రభావంతో గురువారం, శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురు స్తాయని హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా.. బుధవారం హైదరాబాద్లో వాతావరణం ఒక్క సారిగామారిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎండకాసినా.. ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. నగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.

భాగ్యనగరానికి వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో కరెంటు స్తంభాలకు దూరంగా ఉండాలని, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున చెట్ల కింద వాహనాలను నిలపొద్దని హెచ్చరించింది. అకాల వర్షాల నేపథ్యంలో మ్యాన్హాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని భాగ్యనగరవాసులను అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Hyderabad weather update IMD orange alert Telangana Rains Unseasonal Rains in Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.