హైదరాబాద్ లో వర్షాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు, ప్రజల భద్రతా దృష్ట్యా వివిధ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం(Work from home) ఇవ్వాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గురువారం అర్థరాత్రి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తోంది. శుక్రవారం కూడా పడుతుండడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అప్రమత్తమైంది. దీంతో కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని కోరింది. ఈ మేరకు ఎక్స్ పోస్ట్ చేసింది. అలాగే హైదరాబాద్ లో ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తుంది.
Telugu News: Indore: ప్రేమను తిరస్కరించిందని స్కూటీతో ఢీకొట్టిన యువకుడు
ఉదయం నుంచి దంచికొడుతున్న వర్షాలు
హైదరాబాద్ నగరం మొత్తం శుక్రవారం ఉదయం వర్షం దంచికొడుతున్నది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోటు ట్రాఫిక్ జామ్(Traffic jam) అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నుంచి కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
ఏ రాష్ట్రాల్లో వర్షాల హెచ్చరిక జారీ అయ్యింది?
వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కొన్ని దక్షిణ భారత రాష్ట్రాలు ఉన్నాయి.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు ప్రకటించారు?
భారీ వర్షాలు, రహదారి రవాణా అంతరాయం, భద్రతా కారణాల వల్ల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: