📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Latest News: Hyderabad Rains – హైదరాబాద్‌లో వర్షం .. గంటల తరబడి ట్రాఫిక్ జామ్, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 11:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భాగ్యనగరంలో బుధవారం సాయంత్రం ప్రారంభమైన వర్షం గంటల తరబడి కొనసాగి నగరాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆకాశం మబ్బులతో కమ్ముకుని, గాలులతో కూడిన భారీ వర్షం (heavy rain) కురవడంతో రహదారులపై వరదలా నీరు ప్రవహించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్‌పల్లి, కొండాపూర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్ వంటి పలు కాలనీల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, వాహనాల రాకపోకలు పూర్తిగా అడ్డంకులకు గురయ్యాయి. అనేక చోట్ల వాహనాలు స్తంభించి కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి.

Hyderabad Rains

భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు

కొన్నిచోట్ల కారు, ఆటోలు, బైకులు నీటిలో చిక్కుకుపోయాయి. రోడ్డుపై నీరు ఎక్కువగా ఉండటంతో చిన్న వాహనాలు ముందుకు కదలలేకపోయాయి.వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా మియాపూర్‌ (Miyapur) లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత లింగంపల్లిలో 8.2 సెం.మీ., హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University) (హెచ్‌సీయూ)లో 8.1 సెం.మీ., గచ్చిబౌలిలో 6.6 సెం.మీ., చందానగర్‌లో 6.4 సెం.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతోనే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. మరోవైపు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. అత్యవసర సహాయక బృందాలు రంగంలోకి దిగి, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులను చేపట్టాయి. ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, మ్యాన్‌హోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ktr-kcr-public-entry/telangana/549371/

Breaking News Hyderabad flood news Hyderabad heavy rain Hyderabad IT corridor rain Hyderabad monsoon Hyderabad rainfall Hyderabad traffic jam latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.