📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

Author Icon By Sudheer
Updated: September 28, 2025 • 7:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆదిలాబాద్, అసిఫాబాబాద్, మంచిర్యాలల, నిర్మల్ , నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో నదులు, చెరువులు పొంగిపొర్లే పరిస్థితులు ఉన్నందున అధికారులు ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పొడవు గల వంతెనలు, వాగుల వద్ద రాకపోకలు తగ్గించాలని హెచ్చరించారు.

నిన్న కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగంపల్లిలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం కలిగాయి. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.

vaartha live news : vijay : టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట : 31మంది మృతి

ఏపీలోనూ వర్షాలే

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారుల సూచన. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు వర్షాల ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Rains Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.