📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: AP Weather: బంగాళాఖాతంలో వాయుగుండం..ఏపీవైపు దూసుకొస్తున్న తుఫాన్

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 7:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.ఈ తుఫాన్‌ను భారత వాతావరణ శాఖ (IMD) “మొంథా (Montha)”గా నామకరణం చేసింది. ఈ పేరును థాయ్‌లాండ్ సూచించింది. రాబోయే నాలుగు రోజులు ఈ తుఫాన్ దిశ, వేగం, ప్రభావం పరంగా అత్యంత కీలకమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Strike: ఏపీ వైద్యుల సమ్మె ముగింపు!

ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాలకు ముప్పు

తుఫాన్ (storm) ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య తీర ప్రాంతాలపై ఉంటుందని అంచనా. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Department of Meteorology హెచ్చరిస్తోంది. తుఫాన్ కేంద్రానికి దగ్గర ప్రాంతాలు గాలులు గంటకు 60 నుండి 90 కిమీ వేగంతో పీల్చే అవకాశముంది. సముద్ర తీర ప్రాంతాల్లో అలలు తీవ్రంగా ఉప్పొంగే ప్రమాదం ఉంది.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు గ్రామాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. పల్లపు ప్రాంతాలు, నదీ తీరాలు, బీచ్ ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

‘బంగాళాఖాతం (Bay of Bengal) లో అల్పపీడనం రేపటికి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది. సోమవారంకు ఇది తుపానుగా ఇంటెన్సీఫై అవుతుంది. ప్రజలు రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభావంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారంకు తుఫాన్‌గా

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

AP Weather

బంగాళాఖాతంలో అల్పపీడనం సోమవారంకు తుఫాన్‌గా బలపడనుండటంతో ఏపీ ప్రభుత్వం (AP Govt) అప్రమత్తం అయ్యింది. బంగాళాఖాతంలో అల్పపీడనం తుపానుగా బలపడనున్న నేపధ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఈడీ దీపక్, అధికారులతో సమీక్షలో పాల్గొన్నారు.

అత్యంత భారీ వర్ష సూచన ఉందని

అల్పపీడనం నైరుతి,పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సోమవారంకు తుపానుగా బలపడుతుందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.రాష్ట్రానికి శనివారం భారీ, ఆదివారం అతిభారీ.. సోమ, మంగళవారాల్లో అత్యంత భారీ వర్ష సూచన ఉందని వివరించారు. తుఫాన్ తీవ్రతను అంచనా వేసి ప్రభావిత జిల్లాలని అలెర్ట్ చేయాలని హోంమంత్రి సూచించారు. అలాగే ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని.. తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని సూచించారు.సహయక చర్యలకు SDRF, NDRF బృందాలు పంపించాలని హోంమంత్రి అనిత సూచించారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం మరింత అలెర్ట్‌గా ఉండాలని.. కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24/7 కొనసాగించాలన్నారు.

సోషల్ మీడియాలోని వదంతులు నమ్మవద్దని

సోషల్ మీడియాలోని వదంతులు నమ్మవద్దని.. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలన్నారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లలల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలని..

ఎక్కడిక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి ఆహారం అందించాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఉండాలని.. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండొద్దని.. భారీవర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP Cyclone Bay of Bengal depression Breaking News heavy rains ap latest news montha storm Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.