Ap temperature rise : ఏపీలో మార్చి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 36°C దాటే సూచనలు

Read Time:  1 min
Ap temperature rise
Ap temperature rise
FONT SIZE
GET APP

Ap temperature rise : వేసవి కాలం అధికారికంగా ప్రారంభం కాకముందే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి తొలి వారంలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని India Meteorological Department హెచ్చరించింది. దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణ, పశ్చిమ భారత రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి మొదటి వారంలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల మార్క్ దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే సూచనలు ఉన్నాయి.

Read Also: Divorce : గతేడాది ఇండియా లో ఎంతమంది విడాకులు తీసుకున్నారో తెలుసా ?

ap temperature rise
ap temperature rise

రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం కొనసాగనుండగా, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే గురువారం నుంచే ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.

వాతావరణ మార్పుల ప్రభావంతో ఈసారి వేసవి తీవ్రత ముందుగానే మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగుతూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.