हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Assembly Elections : 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – సీఎం రేవంత్

Sudheer
Assembly Elections : 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – సీఎం రేవంత్

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీ సీట్లు 153కు పెరిగే అవకాశముందని, పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రజా సేవకు అంకితంగా ఉండే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కొత్తగా 80 మందికి టికెట్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని, రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్ అమలులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

60 మంది మహిళా ఎమ్మెల్యేలు, కొత్త ముఖాలకు చాన్స్

రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రకటనలో కీలకంగా నిలిచింది మహిళల ప్రాధాన్యత. మహిళా రిజర్వేషన్ అమలైతే కనీసం 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రావచ్చు అని ఆయన పేర్కొన్నారు. అలాగే, వీరిలో 5 నుండి 6 మందికి మంత్రిత్వ హోదా దక్కే అవకాశముందని చెప్పారు. కొత్త నాయకత్వానికి అవకాశమిస్తూ, పార్టీ పటిష్టత కోసం యువత, ప్రజల మధ్య సేవలతో గుర్తింపు తెచ్చుకున్న వారికే ఛాన్స్ ఇస్తామని వివరించారు.

100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు గెలుస్తాం – కేంద్రంలో కాంగ్రెస్

తెలంగాణలోనే కాకుండా కేంద్ర రాజకీయాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందని రేవంత్ చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనకు పూర్తి మద్దతు ఇవ్వనున్నారని, ఈ విజయంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేందుకు తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also : Minimum Balance : ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ పై ఫైన్ లేదు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870