తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ప్రముఖ సినీ నటుడు తలపతి విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రమంలోనే వక్ఫ్ సవరణ చట్టం – 2025 పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆయన స్థాపించిన కొత్త రాజకీయ పార్టీ టీవీకే పౌర హక్కులపై దృష్టి సారిస్తూ, రాజకీయ స్థిరతకంటే ప్రజల సంక్షేమాన్ని ముఖ్యంగా చూస్తుందని విజయ్ నిరూపిస్తున్నారు.

వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేసిన విజయ్
ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం – 2025 రాజ్యాంగబద్ధతపై పలు విమర్శలు వెల్లువెత్తిన వేళ, విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం వల్ల భూ హక్కులు, వ్యక్తిగత హక్కులు దెబ్బతినే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్, AIMIM వంటి రాజకీయ పార్టీలు, పౌరసంఘాలు ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లగా, విజయ్ కూడా అదే బాటలో న్యాయపోరాటానికి దిగారు.
సుప్రీంకోర్టు విచారణకు సిద్ధం
ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణను ఏప్రిల్ 16, 2025 న చేపట్టనుంది. ఇప్పటి వరకు దాఖలైన పది పిటిషన్లు, ఇంకా రావలసిన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ కేసులను పరిశీలించనుంది. తొలుత ఏప్రిల్ 15న విచారణ జరగనున్నట్లు ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసిన నేపథ్యంలో విచారణను ఒక రోజు తరలించి 16నగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో విజయ్ కేవలం సినీ నటుడిగా కాకుండా చట్టాన్ని అర్థం చేసుకున్న నాయకుడిగా కూడా తన ప్రత్యేకతను చాటారు.
Read also: LPG Rate : ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !