Waqf Bill : వక్ఫ్ బిల్లుపై చర్చ : ప్రభుత్వం ముందున్న సవాళ్లు ఇవే 2024లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాల ప్రతిఘటనను ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు ఒప్పుకుంది. బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది మరి ఈ బిల్లును ఆమోదించటం లేదా అనేది ప్రతీ ఒక్కరి మదిలో కూడా పెద్ద ప్రశ్నగా మారింది. కొన్ని వర్గాలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీన్ని సమానత్వం కోసం తీసుకువచ్చినట్టు చెబుతోంది.గతేడాది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. మిగతా రాజకీయ పార్టీల నుండి సమగ్ర చర్చ చేపట్టాలని అభ్యర్థన వచ్చినప్పటికీ, చివరకు జేపీసీకి బిల్లును పంపించారు.

జేపీసీ అనేక పార్టీల మత సంస్థల ప్రముఖ వ్యక్తులతో చర్చలు జరిపి ఈ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది.ఈ చర్చల సమయంలో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఇప్పుడు వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుంది కాదా అనే ఉత్కంఠ ఉన్నది.లోక్‌సభలో ప్రస్తుతం 543 మంది ఎంపీలు ఉన్నారు. స్పీకర్‌ను మినహాయిస్తే ఓటింగ్‌లో 542 మంది పాల్గొంటారు. ఈ ఎంపీలలో బీజేపీ 240 మంది, ఎన్డీయే మిత్రపక్షాలతో కలిపి 294 మంది ఉన్నారు. బిల్లును ఆమోదించడానికి 272 మంది సభ్యుల సాధారణ మెజారిటీ అవసరం. ఇలాంటి పరిస్థితిలో ఎన్డీయే మిత్రపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం కీలకం.ప్రతిపక్షాలకు సంబంధించిన విషయానికి వస్తే, కాంగ్రెస్‌కు గరిష్టంగా 99 ఎంపీలు ఉన్నారు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిపి 233 మంది సభ్యుల బలం ఉంది. మరోవైపు రాజ్యసభలో బీజేపీకి 98, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపి 115 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం 121 మంది సభ్యుల బలం అవసరం అటు విపక్షాల పరిస్థితి కూడా మెలికలు తీసుకుంటుంది.రాజ్యసభలో 119 మంది సభ్యులు బిల్లును ఆమోదించడానికి అవసరం. ప్రస్తుతం విపక్షాల నుంచి కాంగ్రెస్ 27, ఇండియా కూటమి 85, వైసీపీ 7 బీజేడీ 7, అన్నాడీఎంకే 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
వారంతా ఈ బిల్లుకు మద్దతిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం, ఎన్డీయేకు లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లుకు మద్దతు కావాలి. కానీ అన్ని పక్షాలు ఈ బిల్లుకు మద్దతివ్వనున్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద ప్రశ్నగా నిలుస్తోంది.వక్ఫ్ బిల్లుపై చర్చ సమయాన్ని పార్టీల సంఖ్యాబలం ఆధారంగా కేటాయించే విషయం కొరకు స్పీకర్ బీఏసీ సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే, ఈ సమావేశాన్ని విపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్ ఇండియా కూటమి సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించడం విశేషం.ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 2వ తేదీన వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ముందుకు ప్రవేశపెట్టే సమయం దగ్గర పడింది. ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రతిపత్తి, చర్చ, సంక్షేమం, సామాన్యతపై బిజీగా ఉన్న పార్టీలు ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోక తప్పవు.