rahul

మోహ‌న్ భ‌గ‌వ‌త్‌పై రాహుల్ గాంధీ ఫైర్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ పై రాహుల్ గాంధీ త్రీవస్టాయిలో విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ త్రీవస్టాయిలో విమ‌ర్శించారు.. అయోధ్య‌లో రామ్‌ల‌ల్లా ప్ర‌తిష్టాప‌న‌ను స్వాతంత్య్ర దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇవాళ ఢిల్లీలో ఇందిరా గాంధీ భ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌ద్రోహం కింద‌కు వ‌స్తాయ‌న్నారు. మ‌రో దేశం అయితే ఆయ‌న్ను అరెస్టు చేసేవార‌ని ఆరోపించారు. ఆ కేసులో భ‌గ‌వ‌త్‌ను విచారించేవార‌న్నారు.
శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర ట్ర‌స్టు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయ్‌కి మంగ‌ళ‌వారం ఇండోర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో జాతీయ దేవి అహ‌ల్య అవార్డును భ‌గ‌వ‌త్ అంద‌జేశారు. ఆ కార్య‌క్ర‌మంలో భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ.. అయోధ్య‌లో శ్రీరాముడి ప్ర‌తిష్ట దినోత్స‌వాన్ని.. నిజ‌మైన స్వాతంత్య్ర దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌న్నారు.

Advertisements

అయితే భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌ల‌ను రాహుల్ గాంధీ విమ‌ర్శించారు. భార‌త స్వాతంత్రోద్య‌మం గురించి ప్ర‌తి రెండు మూడు రోజుల‌కు ఒక‌సారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నారు. కానీ ఆయ‌న ఇండోర్‌లో మాట్లాడిన వ్యాఖ్య‌లు దేశ‌ద్రోహం కింద‌కు వ‌స్తుంద‌న్నారు. రాజ్యాంగం చెల్ల‌దు అన్న‌ట్లు ఆయ‌న మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. 1947లో భార‌త్‌కు స్వాతంత్ర్యం రాలేద‌న‌డం ప్ర‌తి భార‌తీయుడికి అవ‌మాన‌మే అన్నారు.

Related Posts
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన ప్రమాదం
Union Minister Srinivas Var

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ఢిల్లీలో ప్రమాదానికి గురైంది. విజయ్ చౌక్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే క్రమంలో ఆయన వాహనం ముందు ఉన్న మరో కారును Read more

‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్
‘ఇదంతా దేవుడి ప్లాన్’.. విరాట్ ఎమోషనల్

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. Read more

Infosys: టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్
టెక్కీలకు ఇన్ఫోసిస్ ప్రొఫెషనల్ జాబ్ అఫర్

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలలో తొలగింపులు కొనసాగుతుండగా, పలు కంపెనీలు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 23 వేల మందిని తొలగించాయి. దీనికి కారణాలు ఆదాయాలు తగ్గడం, పెద్ద ఎత్తున Read more

రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం
రైల్వే స్టేషన్ లో మహిళా ప్రయాణికురాలికి తప్పిన ప్రమాదం

బోరివలి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలికి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కదులుతున్న రైలు నుండి దిగే ప్రయత్నంలో, ఆమె అదుపు తప్పి పట్టాలపై పడబోయింది. Read more

×