Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

Advertisements

ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది.. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశామని గుర్తుచేశారు. ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా..? అని మండిపడ్డారు. హోం మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి పాప చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి.. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది.. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోందని తెలిపారు.

Related Posts
ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి Nitin Gadkari
1289448 niti

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలకమైన సమాచారం అందించారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు Read more

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ ప్రతిఏడు సీజనల్ సమయానికి సాధారణంగా ఉండే విషయం. ప్రస్తుతం, స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడడం Read more

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంచు మోహన్ బాబు, విష్ణు
mohanbabu cm

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కలిసి సన్మానించారు. ముఖ్యమంత్రికి శాలువా కప్పి సత్కరించిన Read more

అదుపులోనే ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి: సీఎం యోగి
Situation in Prayagraj under control.. CM Yogi

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్ర‌యాగ్‌రాజ్ కుంభ‌మేళాలో జ‌రిగిన తొక్కిస‌లాట‌పై మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ప్ర‌యాగ్‌రాజ్‌లో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు చెప్పారు. దాదాపు 8 నుంచి Read more

×