📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

సోషల్ మీడియా లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు

Author Icon By Uday Kumar
Updated: February 20, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


సోషల్ మీడియా పై నియంత్రణ అవసరం

సోషల్ మీడియా లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఈ మాట ద్వారా మీరు అంగీకరిస్తున్నట్లుగా భావించవచ్చు, కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే, సోషల్ మీడియా ఒక ప్లాట్‌ఫారమ్ అయినప్పటికీ, అందులో మనం చేసే వ్యాఖ్యలు, పోస్ట్‌లు ప్రైవేట్ గానే కాకుండా పబ్లిక్ గానూ కనిపిస్తాయి.

సోషల్ మీడియా పై కొత్త గైడ్‌లైన్స్

సోషల్ మీడియా ఛానల్స్ కి బ్యాడ్ టైం మొదలు కాబోతుందా? కొత్తగా గైడ్ లైన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటివరకు అయితే ఇష్టం వచ్చిన థంబ్ నైల్స్ పెడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు, తిట్లు విడిగా నడుస్తున్నాయి. ఇక ముందు వీటన్నిటికీ చెక్ పెట్టేస్తారా? మరి ఈ గైడ్ లైన్స్ వస్తే లాభమా లేక నష్టమా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే రీసెంట్ పరిణామాలు దీనే చెప్తున్నాయి.

సోషల్ మీడియా పై సెన్సార్‌షిప్

ఈ రీసెంట్ పరిణామాలు ఈ చర్చకు కారణం అవుతున్నాయి. సోషల్ మీడియా పై సెన్సార్‌షిప్ వేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నిజానికి, సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలి అనేది చాలా కాలంగా వినిపించే మాట. ఎందుకంటే, ఒక్కొక్కళ్ళు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు అనేది చాలా కాలంగా అందరూ అనుకునే మాట.

సినిమాలకి, సోషల్ మీడియాకు సెన్సార్

సినిమాలకు సెన్సార్ ఉన్నట్టే సోషల్ మీడియాకు ఎందుకు ఉండకూడదు అని చాలా మంది వాదిస్తుంటారు. ఎవరికి వారు ఓ YouTube ఛానల్ పెట్టుకొని నచ్చని వారిపై బూతులు తిట్టడాన్ని చూస్తుంటాం. అంటే వాక్ స్వాతంత్రం పేరుతో స్వీయ విచక్షణం మరచిన తీరు కనిపిస్తోంది.

రణవీర్ అలహాబాదియా కామెంట్స్

రీసెంట్ గా దీనికి కారణమైన అంటే ఈ చర్చకు కారణమైన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. “ఇండియాస్ గాడ్ టాలెంట్” ఈ షో లో రణవీర్ అలహాబాదియా చేసిన కామెంట్లపై అందరూ విరుచుకు పడ్డారు. అవి సాధారణ మాటలు కాదు, ఎవరూ సహించాల్సిన అవసరం లేదు, యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. పిచ్చి పీక్స్ లోకి వెళ్ళినట్టు, లిమిట్స్ దాటి మాట్లాడారు. మాటలాడాడు రణవీర్ అలహాబాదియా. దీనిపై ఎఫ్ ఐఆర్‌లు నమోదయ్యాయి. దీని మీద ఇతగాడు సుప్రీం కోర్టు కూడా వెళ్ళాడు. అక్కడ కూడా జడ్జిలు రణవీర్ ను పిచ్చి తిట్లు తిట్టారు.

సుప్రీం కోర్టు అభిప్రాయం

“ఏంటయ్యా నీ బుర్రలో ఇంత చెత్త పెట్టుకున్నావా? ఏం మాటలు ఇవి? నీ మాటలు సమాజం ఆమోదించేలాగా ఉన్నాయా?” అని జడ్జి మందలించారు. పిచ్చితిలు తిట్టారు. “నువ్వు మాట్లాడిన తీరుతో కూతుర్లు, అక్కలు, చెల్లెళ్లు, పేరెంట్స్ అంటే సమాజం తలదించుకుంటుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు దృక్పథం

ఈ సందర్భంలో దీని గురించి మాట్లాడిన సుప్రీం కోర్ట్, భావ ప్రకటన పేరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ఈ ఇద్దరి ధర్మాసనం సమాజ విలువలకు వ్యతిరేకంగా మాట్లాడే లైసెన్స్ ఎవరికీ లేదు అని కామెంట్ చేశారు.

సోషల్ మీడియా కంట్రోల్

YouTube వంటి ఆన్లైన్ వేదికల నియంత్రణకు చట్టంలో ఎలాంటి ఏర్పాట్లు లేవని దీన్ని YouTubers అవకాశంగా తీసుకొని తమ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు అని అభిప్రాయపడింది. YouTubers ఇష్టా రాజ్యంగా ఏం చేసినా నడిచిపోతుంది. ఇది ఇలా నడవడానికి వీలులేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సింది. ఆ చర్యలు మేము తీసుకుంటాం అని ధర్మాసనం చెప్పింది.

YouTube కంటెంట్ నాణ్యత

సో, ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ సోషల్ మీడియాతో ప్రయోజనం ఏంటి, సోషల్ మీడియా వల్ల మనకు కలుగుతున్న ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి? సోషల్ మీడియా మనకు చేస్తున్న నష్టం ఏంటి? ఇప్పటికే ఎలాంటి నియంత్రణలు ఉన్నాయి? ఎలాంటి చెక్ పాయింట్లు ఉన్నాయి? మరి, ఇప్పుడు సుప్రీం కోర్టు చెప్పినట్టు కొత్తగా సోషల్ మీడియా కంట్రోల్ కి గైడ్ లైన్స్ వస్తే ఎలా ఉంటుంది? ఆ గైడ్ లైన్స్ వల్ల లాభం జరుగుతుందా లేక నష్టం జరుగుతుందా?

YouTube: ప్యాకేజింగ్ ముక్యమా కంటెంట్?

మనందరికీ తెలుసు YouTube ఓపెన్ చేయగానే థంబ్ నైల్స్ గుట్టలు గుట్టలుగా కనపడతాయి. అట్రాక్టివ్ గా, టెంప్ట్ చేసేలా కనిపిస్తాయి. ముఖ్యంగా పొలిటికల్ కంటెంట్ విషయానికి వస్తే, క్లిక్ బైట్ కోసం అంటే చూసే వాళ్ళని ఆ క్షణంలో క్లిక్ చేయించాలి. ఆ క్షణంలో టెంప్ట్ చేయాలి. దాని కోసం పోస్ట్ కి సంబంధం లేని థంబ్ నైల్స్ పెడతారు. వాటిలో అసభ్యకరమైన మాటలు వాడతారు. పనికిరాని బూతులు ఉంటాయి, మాటలు ఉంటాయి.

రాజకీయ పార్టీలు మరియు సోషల్ మీడియా

ఈ థంబ్ నైల్స్ విషయంలో ఎవరిని వదలరు. మరీ ముఖ్యంగా పొలిటిషియన్, సినిమా వాళ్ళు అయితే వాళ్ళంతా ఇక్కడ బలి అయిపోతుంటారు. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీ ఇప్పుడు తమ సొంత మీడియా గుంపును తయారు చేసుకుంది. సోషల్ మీడియా వింగ్ ని తయారు చేసుకుంది. ఆ టీంలు YouTube, Instagram, Facebook, Twitter ఇవన్నీ నడుపుతుంటాయి.

సోషల్ మీడియా పాత్ర

సోషల్ మీడియా ఆ స్థాయికి ఎదిగింది. రాజకీయ పార్టీలు చాలా YouTube ఛానల్స్ ని పోషిస్తున్నాయి. అంటేనే వాటి రీచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు, సోషల్ మీడియా పై నియంత్రణలు ఉండాలని, గైడ్‌లైన్స్ రావాలని కోర్టు చెప్తోంది. YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్‌లలో కంట్రోల్ అనేది లేకుండా పోయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు.

YouTube నియంత్రణలు

YouTubers వాళ్ళ ఆలోచనలకు, పోస్టులకు, మాటలకు ఎలాంటి కంట్రోల్ లేకుండా పోతుంది. ఆ కంటెంట్ మీద ఎలాంటి నియంత్రణ లేదు అని సుప్రీం కోర్టు చెప్తోంది. YouTubers ఇష్టా రాజ్యంగా వీడియోలు చేస్తుంటే అవి ప్లే అవుతున్నాయి. వాటిపై ఏ నియంత్రణ లేకపోవడం ఏంటి?

సమాప్తి

ఇది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలంగా కనిపించే విషయం. News Channels కి దీటుగా, సోషల్ మీడియా జనాల మెదడును ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియా ఆ స్థాయికి ఎదిగింది.

Breaking News in Telugu CyberCrime Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News SocialMedia Supreme Court Telangana Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.