📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Tamilnadu : తమిళనాడు బీజేపీ లో ఏమవుతుంది. ? 

Author Icon By Uday Kumar
Updated: April 8, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


అన్నామలై తప్పుకోవడం: తమిళనాడు బిజెపీని కొత్త దిశగా నడిపించాలా?

తెలంగాణలో ఒక ప్రయోగం చేశారు ఇప్పుడు అది తమిళనాడులో చేస్తున్నారు. ఇక్కడ ఫలితం ఏమైందో చూసాం, మరి తమిళనాడులో ఎలా ఉంటుందో చూడాలి. అయితే అంతకంటే ముందు అన్నామలై ఎందుకు తప్పుకున్నారు? దాని వెనుక బిజెపీ వ్యూహం ఏంటి అనే ప్రశ్నలు ఉన్నాయి. తమిళనాడు బిజెపీ కి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. దీని వెనుక ఏం జరిగింది, ఏం జరిగి ఉండొచ్చు? వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ డిఎంకేని ఎలాగైనా కంట్రోల్ చేయాలి అనేది బిజెపీ టార్గెట్.

బిజెపి వ్యూహం: డిఎంకేపై ప్రభావం చూపే ప్రయత్నం

డిలిమిటేషన్, నీట్, త్రిభాషా విధానం వంటి అనేక విషయాల్లో డిఎంకే కేంద్రంతో ఫైట్ చేస్తోంది. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అలాంటి పార్టీని బిజెపీ ఓడించాలి అని చూడడం సహజం. కానీ ఆ పార్టీకి అక్కడంతా బలం లేదు. మరో పార్టీని కలుపుకొని వెళ్లాల్సిందే. ఆ మరో పార్టీ ఏది అంటే, రెండో స్థానంలో ఉన్న అన్నా డిఎంకే తప్ప మరొక ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య మళ్ళీ చర్చలు నడుస్తున్నాయి, దాదాపు ఫైనల్ అయ్యాయి.

అన్నామలై డెసిషన్: తమిళనాడు బిజెపీ కి మార్పు?

ఈ టైంలో ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అది అన్నామలై తమిళనాడు బిజెపీ చీఫ్ పదవి నుండి తప్పుకోవడం. నిజానికి దీని గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది, ఇప్పుడు అది ఓ క్లారిటీకి వచ్చింది. తాను బిజెపీ చీఫ్ పదవి నుండి తప్పుకుంటున్నట్టు అన్నామలై ధృవీకరించారు. తాను మళ్ళీ అధ్యక్ష పదవి రేసులో లేను అని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు.

అన్నామలై మార్పుకు కారణాలు: డిఎంకే కంట్రోల్ అవసరం

నిజానికి అక్కడ అన్నామలై ఉండాలా లేదా అని కాదు, తమిళనాడు బిజెపీకి డిఎంకే గెలవకూడదు. అదే బిజెపీ టార్గెట్. దీనికోసం ఎలాంటి మార్పుకైనా బిజెపీ రెడీగా ఉంది. అందుకే అన్నామలయని తప్పిస్తారు అనే టాక్ కొంత కాలంగా ఉంది. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పొత్తుకు అంగీకరించిన పళళని స్వామి బిజెపీ హై కమాండ్ ముందు కొన్ని కండిషన్లు పెట్టారు. అందులో అతి ముఖ్యమైనది తమిళనాడు బిజెపీ చీఫ్ పదవి నుండి అన్నామలైని తొలగించటం.

అన్నామలై ప్రస్థానం: భవిష్యత్తులో ఏమైనా మార్పు?

అన్నామలై 2021 జూలైలో తమిళనాడు బిజెపీకి చీఫ్ అయ్యారు. ఆయన 2011 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐపిఎస్ అధికారి. ఆయన తరువాత 2019లో బిజెపీలో చేరారు, ఎల్ మురుగన్ స్థానంలో బిజెపీ అధ్యక్షుడయ్యారు. అన్నామలై బిజెపీ అధ్యక్షుడయిన తర్వాత తమిళనాడులో బిజెపీకి ఒక పెద్ద కొత్త ఊపు వచ్చింది. గతంలో లేనట్టుగా ఆ పార్టీ వాయిస్ వినిపించడం మొదలైంది.

తెలంగాణలో బండి సంజయ్ మాదిరిగా తమిళనాడులో ప్రయోగం

ఇప్పుడు ఆయన్ని ఒక్కసారిగా ఎందుకు తీసేసారు? దాని వెనుక కారణాలు ఏంటి? ఈ రెండు కూటమిగా లేకుంటే డిఎంకే బలం పెరుగుతుంది అని ఆల్రెడీ రుజువైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఏ కూటమి 75 సీట్లు గెలుచుకుంది. జనరల్ ఎలక్షన్స్ కు ముందు పొత్తు నుండి రెండు పార్టీలు బయటకి వెళ్లాయి, ఫలితంగా డిఎంకే స్వీప్ చేసింది.

భవిష్యత్తులో సక్సెస్ లేదా విఫలమా?

అందువల్ల కలిసి ఉంటేనే బలం పెరుగుతుంది అని రెండు పార్టీలు గుర్తించాయి. కలిసి ఉంటే డిఎంకే ఈ స్థాయిలో గెలిచేది కాదు అనే అభిప్రాయం బిజెపీలో ఉంది. అందుకే ఈ రెండు పార్టీలకు పొత్తు తప్పనిసరి. సో, ఈ విషయంలోనే అన్నామలయని పక్కన పెట్టించడంలో అన్నా డిఎంకే సఫలమైంది అంటున్నారు.

Annamalai BJP Annamalai Latest News BJP Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News tamilnadu tamilnadubjp Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.