భూకంపాలు తరచుగా సంభవించే ఇథియోపియాలోని అఫార్ ప్రాంతంలో సుమారు 12,000 సంవత్సరాలుగా నిద్రాణమై ఉన్న హేలీ గుబ్బి (Hale Guba) అగ్నిపర్వతం(Volcani Erruption) ఒక్కసారిగా విస్ఫోటనం చెందడంతో ఈశాన్య ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం ఉదయం పలు గంటల పాటు జరిగిన ఈ విస్ఫోటనం వల్ల దట్టమైన బూడిద మరియు పొగ మేఘాలు సుమారు 14 కిలో మీటర్ల (9 మైళ్లు) ఎత్తుకు ఎగజల్లాయి.
Read Also: Trump: ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే ప్రక్రియ ప్రారంభం
ఈ విస్ఫోటనాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానిక నివాసి అహ్మద్ అబ్దేలా మాట్లాడుతూ, అకస్మాత్తుగా బాంబు పేలినట్లు అనిపించిందని, ఈ ప్రాంతమంతా పొగ, బూడిదతో నిండిపోయిందని వివరించారు. అగ్నిపర్వతం పేలిన వెంటనే పెద్ద శబ్దం, ఒక విధమైన షాక్ వేవ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ ప్రభావం, ఆర్థికపరమైన ఆందోళన
ఈ బూడిద మేఘాలు ఎర్ర సముద్రాన్ని దాటి యెమెన్ మరియు ఒమన్ దేశాల వైపు కదులుతుండటం అంతర్జాతీయ ఆందోళనను(Volcani Erruption) పెంచుతోంది. అదృష్టవశాత్తు ఈ విస్ఫోటనం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక పరిపాలనా అధికారి మొహమ్మద్ సెయిద్ తెలిపారు. అయితే, సమీపంలోని అఫ్‌డెరా గ్రామం సోమవారం కూడా దట్టమైన బూడిదతో నిండిపోయింది. ప్రఖ్యాత దనకిల్ ఎడారికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ గ్రామంలో పర్యాటకులు, గైడ్‌లు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ విపత్తు స్థానిక ప్రజల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఫార్ ప్రాంత ప్రజలు ప్రధానంగా పశువుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు. బూడిద మేఘాలు పచ్చిక బయళ్లపై పడటం వలన పశువుల మేత, తాగునీరు కలుషితమై, స్థానిక ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
విమాన రాకపోకలపై ఆటంకం
ఈ విస్ఫోటనం ఇథియోపియా(Ethiopia), అరేబియా ద్వీపకల్పం మధ్య ఉన్న గగనతలంపై ప్రభావం చూపడంతో, ఆ ప్రాంతంలో విమాన రాకపోకలకు ఆటంకం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు, విమానయాన అధికారులు ఈ బూడిద మేఘాల కదలికపై నిరంతరం నిఘా ఉంచుతున్నారు. 12 వేల ఏళ్ల తర్వాత మేలుకున్న ఈ అగ్నిపర్వతం పర్యావరణపరంగా ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందో వేచి చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read also :