మూడో వన్డే ఓటమితో, అనంతరం ఇండోర్ హోల్కర్ స్టేడియంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారత్ ఓటమి తర్వాత స్టేడియంలో అభిమానులు గట్టిగా గౌతమ్ గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ క్లిప్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సహా భారత ఆటగాళ్లు ప్రేక్షకుల నినాదాలు విని ఆశ్చర్యానికి గురైనట్లు కనిపించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు గంభీర్‌పై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: Panvel Railway Station: అథ్లెట్ల కు రైలులో చేదు అనుభవం?
టెస్టులు, వన్డేల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు
ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఓటమితో, భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో న్యూజిలాండ్‌కు అప్పగించింది. భారత గడ్డపై కివీస్‌కు ఇదే మొట్టమొదటి వన్డే సిరీస్ విజయం కావడం గమనార్హం. ఈ ఓటమి తర్వాత ఆన్‌లైన్‌లో కూడా గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.గంభీర్ కోచింగ్‌లో భారత్ టీ20 ఫార్మాట్‌లో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి విజయాలు సాధించినా.. టెస్టులు, వన్డేల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. 2024లో స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్ అవ్వడం కూడా అభిమానుల ఆగ్రహానికి ఒక కారణం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: