
థలపతి విజయ్ (Vijay) అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలైంది. “థలపతి కచేరీ” పేరుతో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.
అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) స్వరపరిచిన ఈ పాట,మ్యూజిక్ లవర్స్‌కి, విజయ్ అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చింది. పాట విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
Read Also: Viral Video: ఆప్యాంగా ఆలింగనం చేసుకున్న రేవంత్ రెడ్డి, బాలయ్య
ఈ పాటను రూపొందించిన విధానం
అనిరుద్ రవిచందర్, థలపతి విజయ్ (Vijay), అరివు ముగ్గురు కలిసి ఈ పాటను పాడటం మరో హైలైట్.ఈ పాటను రూపొందించిన విధానం కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. థలపతి విజయ్ కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ సినిమాలైన “మాస్టర్”, “లియో”, “మెర్సల్”, “తుపాకీ”, “గిల్లి” వంటి చిత్రాల నుంచి తీసుకున్న స్టెప్స్‌ను ఈ పాటలో మిక్స్ చేశారు.
పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేస్తూ, కొత్త ఉత్సాహాన్ని పెంచేలా ఈ వీడియో ఉంది.థలపతి విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #ThalapathyKacheri, #JanaNayaganSong హ్యాష్ టాగ్స్ తో, ట్రెండ్ చేస్తున్నారు. అభిమానులు పోస్టులు చేస్తూ, “ఇది కేవలం పాట కాదు.. ఫ్యాన్స్‌కి ఫెస్టివల్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: