యుద్ధం మరియు జియోపోలిటికల్ ప్రభావాలు
ఎందుకయ్యా ఈ యుద్ధాలు పాడు మీకు అసలు
బుద్ధి లేదా ఏంటి పిచ్చి పనులు నోరు
మూసుకొని చెప్పింది విను అంటున్నాడు
ట్రంప్ అమెరికా ఒక్కసారిగా అన్ని రకాలుగా
మారిపోయింది ఈ మార్పు ఎందుకు ఈ మార్పు
వెనుక కారణం ఏంటి కొత్త స్నేహాలు కొత్త
శత్రుత్వాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి
మాస్టర్ ప్లాన్ వేసిన ట్రంప్ టార్గెట్ ఏంటి?
ముఖ్యంగా రష్యా, ఉక్రైన్ వారి విషయంలో అమెరికా స్టాండ్
మారడం వెనుక ట్రంప్ వ్యూహం ఏమై ఉంటుంది?
అమెరికా యొక్క వ్యూహాలు మరియు వనరులు
ఆయుధాలు అమ్మి వాటిని సరఫరా చేసి
యుద్ధాలను రెచ్చగొట్టే అమెరికా ఇప్పుడు ఏ
ప్రయోజనాలకు కోసం ఉక్రైన్ మెడలు వంచి
యుద్ధాన్ని ఆపబోతోంది కాసేపు. ఈ యుద్ధం
ట్రంప్, జెలన్స్కీ, ఎలాన్ మస్క్ ఇవన్నీ
పక్కన పెట్టి ఉక్రైన్ లో ఉన్న వనరులు ఏంటో
అక్కడి భూమి పొరల్లో ఏముందో చెప్పుకుందాం.
ఉక్రైన్ లో అపారమైన ఆయిల్ గ్యాస్ నిల్వలు
ఉన్నాయి అక్కడ భూమి పొరల్లో ఉన్న అత్యంత
విలువైన మినరల్స్ విలువ ఎంత తెలుసా?
రష్యా వేసిన లెక్కల ప్రకారం 12 ట్రిలియన్
డాలర్లు అంటే మన దేశ ఎకానమీ కంటే విలువైన
ఖనిజాలు ఉక్రైన్ భూమిలో ఉన్నాయి.
ఉక్రైన్ వనరులు: ప్రాముఖ్యత మరియు దృష్టికోణం
ఉక్రైన్ లో టైటానియం నిల్వలు అపారంగా ఉన్నాయి.
ప్రపంచ టైటానియం లో 7% అక్కడే ఉంది అంటే
ప్రపంచ టైటానియం లో 7% ఉక్రైన్ భూమిలోనే
ఉంది. ఇది ఒక్కటే కాదు, బెరీలియం, యురేనియం,
మ్యాంగనీస్ నిల్వలు అపారంగా ఉన్నాయి.
యుద్ధం కంటే ముందు ఉక్రైన్ గాలియం
ఉత్పత్తిలో ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది.
నియాన్ గ్యాస్ ఉత్పత్తిలో ఉక్రైన్ దే
మేజర్ షేర్. ఇదే కాదు, ఈ లిస్ట్ ఇంకా చాలా
ఉంది: కాపర్, జింక్, సిల్వర్, లెడ్, నికెల్,
కోబాల్ట్, గ్రాఫైట్. ఇవన్నిటి నిల్వలు
ఉక్రైన్ భూమి పొరల్లో అపారంగా ఉన్నాయి.
మా లాభం కోసం వ్యాపారం: ట్రంప్ యొక్క వ్యూహం
మాస్టర్ ప్లాన్ వేసిన ట్రంప్ ఇప్పుడు
సౌదీ అరేబియాలో పుతిన్ తో శాంతి చర్చలకు
కూడా దిగాడు. ఇప్పటికీ, అమెరికా, పుతిన్ టీం
రెండు చర్చలు జరుపుతున్నాయి. ఎవరికీ ఎలాంటి
సాయం చేసేది లేదు, అంతా బిజినెస్ లాభ
నష్టాల భాష మాత్రమే. “నాది,” అనే ట్రంప్
అమెరికా లాభం కోసం ఏ ఏదైనా చేస్తాను అంటున్నాడు.
ఉక్రైన్: ట్రంప్ వ్యూహం వల్ల కలిగిన మార్పులు
ఇప్పటికే 200 బిలియన్ డాలర్ల ఆర్థిక ఆయుధ
సాయం చేసి, దానికి ఎన్ని రెట్ల లాభాన్ని
ఉక్రైన్ నుండీ అమెరికా పొందుతుందో ఎవరు
చెప్పే పరిస్థితి లేదు. రక్తం ఓడుతున్న గాజాలో
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, బీచ్ ఫ్రంట్
రిజర్ట్లను చూస్తున్న ట్రంప్, ఉక్రైన్ లో
తవ్వుకోవాల్సిన గనుల్ని, అత్యంత విలువైన
ఖనిజాలను చూస్తున్నాడు. ఇప్పటికీ, దీనికి
సంబంధించి ఒక ఆఫర్ కూడా పెట్టాడు.