బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్’ (Ikkis Movie). పరమవీర చక్ర పురస్కార గ్రహీత, సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఇందులో హీరోగా నటిస్తుండగా, ‘అంధాధున్’ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Read Also: OTT: కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
ట్రైలర్ విడుదల
ఈ (Ikkis Movie) చిత్రం మొదట డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అవతార్, ధురంధర్ చిత్రాల వలన వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను జనవరి 01 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
కేవలం 21 ఏళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అరుణ్ ఖేతర్‌పాల్ వీరగాథను, ఆయన ధైర్యసాహసాలను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. అద్భుతమైన పోరాట పటిమకు గుర్తింపుగా ఆయనకు మరణానంతరం పరమవీర చక్ర లభించింది.ఈ చిత్రంలో ధర్మేంద్ర.. అరుణ్ ఖేతర్‌పాల్ తండ్రి బ్రిగేడియర్ ఎం.ఎల్. ఖేతర్‌పాల్ పాత్రలో కనిపించనున్నారు. దేశం కోసం కొడుకును కోల్పోయినా, ఒక సైనికుడిగా గర్వపడే తండ్రిగా ఆయన నటన భావోద్వేగభరితంగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: