సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), మీనాక్షీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి బరిలో అలరించేందుకు సిద్ధమవుతోంది. మారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి.
Read Also: Anirudha Srikkanth: నటి సంయుక్తను పెళ్లాడిన క్రికెటర్ అనిరుద్ధ
నవీన్ పొలిశెట్టి స్వయంగా పాట పాడాడు
తాజాగా ‘భీమవరం బల్మా’ అనే పాటని రిలీజ్ చేశారు. ‘చాట్ జీపీటీ.. ఎవరీ బ్యూటీ’ అంటూ సాగే పాటకి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. సింగర్ నూతన మోహన్‌తో కలిసి నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) ఈ పాటని స్వయంగా పాడటం విశేషం. చంద్రబోస్ లిరిక్స్ రాశారు. నవీన్ – మీనాక్షి మాస్ స్టెప్పులతో అలరించారు. ఈ లిరికల్ వీడియో మీరూ చూడండి..
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: