పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత డార్లింగ్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో రాజా సాబ్ సినిమా (The Rajasaab Movie) ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే విపరీతమైన హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ట్రైలర్ విడుదల కాగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ట్రైలర్ తో సినిమా (The Rajasaab Movie) పై అంచనాలు పీక్స్ కు చేరింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: The Family Man Season 3: ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ (అమెజాన్ ప్రైమ్) సిరీస్ రివ్యూ
‘రెబల్ సాబ్’ సాంగ్ రిలీజ్
ఫస్ట్ సింగిల్ తో సందడి చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ‘ రెబల్ సాబ్ ’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. ప్రభాస్ స్టైల్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ బీట్‌లు, హై-ఎనర్జీ విజువల్స్‌తో ఈ పాట అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.‘రెబల్ సాబ్’లో ప్రభాస్ లుక్స్, స్టైల్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్‌గా ఉన్నాయి.
ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభాస్ ఒక కలర్ ఫుల్ సాంగ్ తో, వందల మంది డ్యాన్సర్లతో స్టెప్పులేస్తూ కనిపించడం అభిమానులకు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఎస్. థమన్ ఈ పాటకి ట్యూన్ కంపోజ్ చేయగా.. సంజిత్ హెగ్డే, బ్లేజ్ కలిసి ఈ పాట పాడారు. రొమాంటిక్ రెబల్ సాబ్.. పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ అంటూ ప్రభాస్ పాత్రని, రియల్ లైఫ్ ని దృష్టిలో పెట్టుకొని రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: