Latest News: The Girlfriend Movie: ది గర్ల్‌ఫ్రెండ్‌ ట్రైలర్ లో హైలైట్స్ ఇవే!

Read Time:  1 min
Rashmika mandanna
Rashmika mandanna
FONT SIZE
GET APP
The Girlfriend Movie
The Girlfriend Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఇటీవలి సంవత్సరాలలో వరుస బ్లాక్ బస్టర్లతో తెలుగు, తమిళం, హిందీ సినీ పరిశ్రమల్లో సత్తా చాటింది. యానిమల్, పుష్ప 2: ది రూల్, ఛావా, థామా సినిమాలతో ఆమె స్టార్‌డమ్ మరింత పెరిగింది.

ఒక వైపు గ్లామర్, మరో వైపు ఎమోషన్, అవసరమైతే మాస్ యాక్షన్ – ఎలాంటి పాత్ర అయినా చేయగల నటి అని నిరూపించుకుంది. తాజాగా రష్మిక పూర్తిగా తనదైన ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది. అదే ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ (The Girlfriend Movie).

Shiva Re-release: 36 ఏళ్ల తర్వాత ‘శివ’ – థియేటర్లలో వేడుక

ఈ (The Girlfriend Movie) సినిమాకు రాహుల్ ర‌వీంద్ర‌న్ (Rahul Ravindran) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ‘మనం చిన్న బ్రేక్ తీసుకుందామా..’’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఎమోష‌న‌ల్‌గా సాగింది. ఇందులో ర‌ష్మిక బాయ్ ​ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty) న‌టించ‌బోతున్నాడు. గీత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను అల్లు అర‌వింద్ (Allu Aravind) నిర్మిస్తున్నాడు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.