‘రాన్‌జానా’, ‘అత్రాంగి రే’ వంటి భావోద్వేగాలతో నిండిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్, హీరో ధనుష్ (Dhanush) కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘తేరే ఇష్క్ మే’ (Tere Ishk Mein Movie) ఇప్పటికే ఈ సినిమా హైప్ క్రియేట్ చేసింది. ధనుష్‌కు బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఈ కాంబినేషన్‌పై హైప్ ఉంది.. ఈ చిత్రం హిందీతో పాటు తమిళం తెలుగులో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో, చిత్రబృందం తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది.
Read Also: Avihitham: ‘అవిహితం’ మూవీ రివ్యూ!
ట్రైలర్ లో హైలైట్స్
ఈ సినిమాలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నాడు. కృతి సనన్ కథానాయికగా నటించబోతుండగా.. ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నాడు. ఈ (Tere Ishk Mein Movie) ట్రైలర్‌ను చూస్తుంటే.. ధనుష్ ఇందులో ప్రేమలో మోసపోయిన వ్యక్తిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే కృతి (Kriti Sanon) అతడిని అలా వదిలేయడానికి కారణం ఏంటి.. చివరికి వీరిద్దరూ కలుస్తారా అనేది ఈ సినిమా కథ.
ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథను అందిస్తుండగా.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. భుషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: