నందమూరి నటసింహం బాలకృష్ణ పేరు వినగానే వచ్చే ఎలక్ట్రిక్ జోష్… మాస్ వైబ్… పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, రక్తం మరిగించే డైలాగులే గుర్తుకొస్తాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలున్నా బాలయ్య లాంటి మాస్ ఇమేజ్ మరొకరికి లేదంటే అతిశయోక్తి ఉండదేమో. ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, రౌద్ర నృసింహం లాంటి స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ పంథాలో బోయపాటి శ్రీను చూపే దుమ్ము రేపే ట్రీట్ ఈ రెండు శక్తులు కలిసినపుడు వచ్చే తుఫాన్ మామూలుగా ఉండదు.
Read Also: kamini kaushal: ప్రసిద్ధ నటి కామిని కౌశల్ కన్నుమూత!
అదే కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తూ ‘ అఖండ 2 (Akhanda 2) తాండవం’ మూవీకి తెరపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 2021లో వచ్చిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద చేసిన హవా మామూలుగా లేదు. ఆ సినిమాతో బాలయ్య తిరిగి మాస్ అవతారాన్ని పీక్స్‌కి తీసుకెళ్లగా బోయపాటి కూడా తన కెరీర్‌లోనే ఒక పెద్ద మైలురాయిని అందుకున్నాడు.
విడుదలైన రోజే సోషల్ మీడియా మొత్తం
అలాంటి విజయానికి సీక్వెల్ వస్తోంది అన్న వార్తే అభిమానుల్లో ఉత్సాహం పుట్టించింది. ఫస్ట్ లుక్‌లో శివతాండవం చేస్తున్నట్లుగా కనిపించిన బాలకృష్ణ లుక్ అభిమానులను మంత్ర ముగ్దులను చేయగా, టీజర్ విడుదలైన రోజే సోషల్ మీడియా మొత్తం “అఖండ తిరిగి వచ్చాడు” హోరెత్తిపోయింది. తమన్ ఇచ్చిన బ్లాస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టైల్‌కు తగ్గట్టే మాస్ విజువల్స్ కలిసి టీజర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ముంబయిలో నిర్వహించిన ఈవెంట్లో ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘తాండవం’ పేరుతో ఓ పవర్‌ఫుల్ పాటను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. విడుదలైన కాసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.’అఖండ 2′ (Akhanda 2) చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: