
తమిళనాడులోని కరూర్ జిల్లా (Karur District) విషాదకర సంఘటనతో వణికిపోయింది. అక్కడ జరిగిన ఒక పెద్ద ర్యాలీలో తొక్కిసలాట సంభవించి 41 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ (Vijay) నిర్వహించిన సభలో ఈ ఘోరం జరిగింది.
Crime:హోంవర్క్ చేయలేదని తలకిందులుగా వేలాడదీసిన ప్రిన్సిపాల్.. ఎక్కడంటే?
భారీగా జనాలు తరలి రావడంతో అల్లకల్లోలం ఏర్పడి ఈ విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి, సింగిల్ జడ్జి విచారణ (Single judge trial) కు ఆదేశాలు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి కనీసం ఒక పెద్ద తొక్కిసలాట
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి, “తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నాటికి కనీసం ఒక పెద్ద తొక్కిసలాట జరుగుతుంది. అందులో 50 మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చు. ఈ ఘటనకు విజయ్ అనే వ్యక్తే కారణమవుతాడు” అని చెప్పాడు. ఆ పోస్ట్ ఇప్పుడు విస్తృతంగా షేర్ అవుతోంది.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించి మరో వ్యక్తి ఇదే తరహా ఆరోపణలు చేసిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది.‘తమిళనాడులో 2026 (2026 in Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల సమయానికి కనీసం ఒక్క తొక్కిసలాటైనా జరిగి తీరుతుంది. అందులో కనీసం 50 మంది యువత ప్రాణాలు కోల్పోతారు. వీటన్నింటికీ విజయ్ అనే వ్యక్తి కారణమవుతాడు.
వారు బుద్ధిలేని, క్రూరమైన ఆటవికుల వంటివారు. డీఎంకే కంటే 10 రెట్లు విషపూరితమైన వ్యక్తులు. రాజకీయాల్లో ప్రతిపక్షం, కూటమి భాగస్వాములు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం రాష్ట్ర రాజకీయాల్లోని మూర్ఖత్వాన్ని సూచిస్తుంది” అని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: