యంగ్ హీరో సుహాస్ (Suhas), శివానీ నగరం జంటగా నటించిన తాజా చిత్రం ‘హే భగవాన్’. బన్నీ వాస్, వంశీ నందిపాటి సమర్పణలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈనెల 20న విడుదలవుతోంది.తాజాగా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. సీనియర్ నటుడు నరేష్ తన కుటుంబ వ్యాపారాన్ని, రహస్యంగా నిర్వహిస్తుంటారు. ఆ వ్యాపారం ఏంటో ఎవరికీ చెప్పకూడదనే నిబంధన ఉంటుంది. అయితే తన తండ్రి వ్యాపారాన్ని సుహాస్ టేకోవర్ చేద్దామనుకుంటాడు.
Read Also: Film fare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. తెలుగు సినిమాల జోరు
ఎమోషనల్ టచ్
ఈ క్రమంలో ఎదురయ్యే సంఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ తర్వాత సుహాస్, శివానీ నాగారం మరోసారి జోడీ కట్టడం ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. దర్శకుడు గోపీ అచ్చర ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించడమే కాకుండా, క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుందని తెలిపారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను త్రిశూల్ విజనరీ స్టూడియోస్ నిర్మించగా, బన్నీ వాస్ మరియు వంశీ నందిపాటి సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: