పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit) నుంచి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్‌డేట్ చివరికి విడుదలైంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి చిత్ర బృందం ‘ది సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిల్మ్ స్పిరిట్’ (Spirit)పేరుతో ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
Shabdam: శబ్దం – హారర్ థ్రిల్లర్ స్పెషల్
ఈ గ్లింప్స్ ప్రత్యేకత ఏమిటంటే — ఇందులో ఒక్క విజువల్ కూడా లేకుండా, కేవలం ఆడియోతోనే ప్రేక్షకుల ఊహాశక్తిని రెచ్చగొట్టేలా తీర్చిదిద్దారు. కేవలం శబ్దాలతో, వాయిస్ ఓవర్లతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటించగలగడం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్టైల్‌నే మళ్లీ గుర్తు చేసింది.1 నిమిషం 31 సెకన్ల నిడివి ఉన్న ఈ సౌండ్ గ్లింప్స్‌లో, ఒక ఐపీఎస్ అధికారి అయిన ప్రభాస్‌ను అరెస్ట్ చేస్తున్న సన్నివేశాన్ని కేవలం సంభాషణలు,
శబ్దాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. “వీడి గురించి విన్నాను… యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదు… చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా ఉంటాడో!” అంటూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చెప్పే వాయిస్ ఓవర్, సందీప్ వంగా మార్క్ రైటింగ్‌ను గుర్తుచేసింది.
చివర్లో ప్రభాస్ చెప్పిన డైలాగ్
ఇక ఈ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచింది చివర్లో ప్రభాస్ (Prabhas) చెప్పిన డైలాగ్. “మిస్టర్ సూపరింటెండెంట్… నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది…” అంటూ ఆయన చెప్పిన ఒక్క డైలాగ్‌తోనే ఈ సినిమాలో ఆయన పాత్ర ఎంత తీవ్రంగా, మొరటుగా ఉండబోతుందో స్పష్టమైంది. ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సినిమా సౌండ్ డిజైన్‌పై మాట్లాడిన చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. “సాధారణంగా సినిమా షూటింగ్ పూర్తయ్యాక నేపథ్య సంగీతం అందిస్తారు. కానీ ‘స్పిరిట్’ కోసం మేం షూటింగ్‌కు ముందే 70 శాతం సౌండ్‌ట్రాక్‌ను సిద్ధం చేశాం. ఆ సౌండ్ ఆధారంగానే షాట్లను చిత్రీకరించబోతున్నాం” అని తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఇదొక అరుదైన ప్రయోగమని సినీ వర్గాలు అంటున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: