📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Shardul Thakur: ముంబై ఇండియన్స్‌లోకి శార్దూల్ ఠాకూర్?

Author Icon By Anusha
Updated: November 13, 2025 • 11:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ (Shardul Thakur) కు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఐపీఎల్ 2026 సీజన్‌ ముందు బయటకు వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) నుంచి ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టు ఈ స్టార్ బౌలర్‌ను ట్రేడ్ చేసుకుందనే సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ విషయాన్ని సీనియర్ ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పొరపాటున బయటపెట్టారు. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Sadagoppan Ramesh: సీఎస్‌కే నిర్ణయాన్ని తప్పుబట్టిన సదగొప్పన్ రమేష్

అశ్విన్ నోటి మాటలో బయటపడిన ట్రేడ్‌ డీల్‌

ఐపీఎల్ ట్రేడింగ్ విండో ముగియనున్న నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్, అర్జున్ టెండూల్కర్‌ల విషయంలో ముంబై, లక్నో ఫ్రాంచైజీల మధ్య చర్చలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది ఆటగాళ్ల పరస్పర మార్పిడి (స్వాప్ డీల్) కాదని, రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగే వ్యక్తిగత డీల్స్ అని క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది.

ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ, అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ ‘యాష్ కీ బాత్’లో ఈ ట్రేడ్ జరిగిపోయిందని చెప్పేశారు.”ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఎవరినీ విడుదల చేస్తుందని నేను అనుకోవడం లేదు. తరచూ గాయాలపాలయ్యే దీపక్ చాహర్‌కు ప్రత్యామ్నాయం వెతకడం వారికి పెద్ద సవాలుగా ఉంటుంది.

https://twitter.com/Sumittt_0707/status/1988569348378923305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1988569348378923305%7Ctwgr%5E119c52b2d2190a0311826ea211bf68a0b0d42d1d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F847883%2Fshardul-thakur-to-mumbai-indians-leaked-by-ashwin

ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో

వారు ఇప్పటికే లక్నో నుంచి శార్దూల్ ఠాకూర్‌ (Shardul Thakur) ను ట్రేడ్ ద్వారా దక్కించుకున్నారు. ఇది జరిగిపోయింది. బహుశా వారు ఒక స్పిన్నర్ కోసం చూసి, అతడిని కూడా తీసుకుంటారు” అని అశ్విన్ (Ashwin) వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, ఆ తర్వాత వీడియో నుంచి ఈ భాగాన్ని తొలగించారు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో శార్దూల్ అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత లక్నో జట్టులో మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతడి స్థానంలో శార్దూల్‌ను తీసుకున్నారు. సీజన్ ఆరంభంలో తొలి రెండు మ్యాచ్‌లలో 6 వికెట్లతో రాణించినా, ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తం 10 మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

IPL 2026 latest news Lucknow Super Giants Mumbai Indians R Ashwin Shardul Thakur Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.