Latest News: Shambhala Movie: శంబాల ట్రైల‌ర్‌ విడుదల

Read Time:  1 min
Shambhala Movie
Shambhala Movie
FONT SIZE
GET APP
Shambhala Movie
Shambhala Movie

టాలీవుడ్‌లో ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే ఆది సాయికుమార్ (Adi Sai kumar), ఈసారి మరో ఆసక్తికరమైన సబ్జెక్ట్‌తో రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల.. ఏ మిస్టిక్ వరల్డ్’. (Shambhala Movie) యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అర్చన అయ్యర్, స్వాసిక్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించగా, రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also: Peddi Movie: జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మేకర్స్ డిసెంబర్ 25న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. క్రిస్మస్ (Christmas) సందర్భంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను భయపెడుతూ, మైమరపింపజేసే అనుభూతిని అందించనుందని చెబుతున్నారు.

ట్రైల‌ర్‌ విడుద‌ల

ఈ సంద‌ర్భంగా మూవీ (Shambhala Movie) నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్.కొన్ని వేల సంవ‌త్స‌రాల క్రితం ప‌ర‌మ‌శివుడికి, అసురుడికి మ‌ధ్య జ‌రిగిన ఒక భీక‌ర‌యుద్ధం ఈ క‌థ‌కి ములం అంటూ సాయికుమార్ వాయిస్ ఓవ‌ర్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌య్యింది.

అనంత‌రం ఆకాశం నుంచి ఒక ఉల్క లాంటి రాయి కిందికి వచ్చి ఒక ఊరిలో ప‌డుతుంది. అయితే అది ప‌డిన త‌ర్వాత నుంచి ఆ ఊరిలో ప్ర‌జ‌లు వింత‌గా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. అయితే దాని వెనుక ఉన్న ర‌హస్యం ఏంటి.. ఆ ర‌హ‌స్యాన్ని కనుగొని ప్ర‌జ‌ల‌ను హీరో ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా క‌థ‌. ఆది సాయికుమార్ ఈ చిత్రంలో భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.