యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్(Sai Abhyankar) ఇటీవల సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశంగా మారారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన ‘డ్యూడ్’ మూవీ మొదట విడుదలైనప్పుడు ఆయన సంగీతంపై కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మొదటి సింగిల్ ‘ఊరం బ్లడ్’(oorum blood)కి trolls ఎక్కువయ్యాయి. అయితే సినిమా థియేటర్‌లలో విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటల్లో ఉన్న intensityను ప్రేక్షకులు గుర్తించడం ప్రారంభించారు. “స్లో పాయిజన్ మ్యూజిక్” అంటూ ప్రశంసలు లభించాయి.
Read Also: Hidma maoist: హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకం ..పట్టుకొని చంపారు: సంచలన లేఖ
అయితే నిజమైన హిట్ OTT రిలీజ్ తర్వాత వచ్చింది. ‘ఊరం బ్లడ్’ ఒరిజినల్ స్కోర్ ఆధారంగా సోషల్ మీడియాలో వందలాది వీడియో ఎడిట్లు వైరల్ అయ్యాయి. ముందుగా విమర్శించినవారే ఈసారి సాయి అభ్యంకర్‌ను పొగిడడం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్‌లో వినిపించిన రీహాష్ BGM ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయింది. దాని యూనివర్సల్ వైబ్ కారణంగా ఇతర సినిమాల క్లిప్స్‌కీ అదే BGMను జతచేసి నెటిజన్లు భారీగా షేర్ చేశారు.
దీంతో ‘ఊరం బ్లడ్’ వీడియో సాంగ్ మళ్లీ ట్రెండ్ అవుతూ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటింది. మొదట బలమైన నెగెటివ్ రియాక్షన్ వచ్చినా, ఇప్పుడు అదే పాట ఆయన కెరీర్‌లో అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచింది.
ఇప్పుడు సాయి అభ్యంకర్ దక్షిణాదిలో వేగంగా ఎదుగుతున్న సంగీత దర్శకుడిగా కనిపిస్తున్నారు. ఇంకా పెద్ద సినిమాలు విడుదల కాకముందే, ఆయనకు అల్లుఅర్జున్–అట్లీ ప్రాజెక్ట్, సూర్య ‘కరుప్పు’, కార్తి ‘మార్షల్’ వంటి భారీ సినిమాల అవకాశాలు రావడం ఆయన క్రేజ్‌ను మరింత పెంచింది.
ఈ అనూహ్య మార్పుతో సాయి అభ్యంకర్‌పై ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఆయన తదుపరి ఆల్బమ్‌లు, స్కోర్లు ఎలా ఉండబోతాయో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: