టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఎప్పుడూ తన స్టైలిష్ బ్యాటింగ్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. కానీ ఈసారి ఆయన కొట్టిన సిక్సర్ అందరినీ నవ్వుల్లో ముంచెత్తేలా ఒక వినోదాత్మక సంఘటనగా మారింది. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ (ODI series) కు ముందు రోహిత్ ముంబైలోని ప్రసిద్ధ శివాజీ పార్క్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఆ నెట్ సెషన్‌లో రోహిత్ (Rohit Sharma) తన హిట్టింగ్ స్కిల్స్‌ను ప్రదర్శిస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
IND vs WI: టీమిండియా భారీ స్కోర్
వివరాల్లోకి వెళితే, రోహిత్ శర్మ నెట్స్‌లో బౌలర్ల బంతులను ఎదుర్కొంటూ కవర్ డ్రైవ్‌లు, స్వీప్ షాట్లతో అలరించాడు. ఈ సమయంలో అతను కొట్టిన ఓ సిక్సర్ నేరుగా పార్కింగ్‌లో ఉన్న తన లంబోర్ఘిని కారు (Lamborghini car) పై పడింది. ఈ దృశ్యాన్ని వీడియో తీస్తున్న ఓ అభిమాని, “అయ్యో, తన కారునే పగలగొట్టుకున్నాడు” అని హిందీలో అనడం స్పష్టంగా వినిపించింది.
ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఇటీవలే భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్‌ను తప్పించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా సిరీస్‌కు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా, శ్రేయస్ అయ్యర్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించారు.
నాయకత్వ బాధ్యతలు లేనప్పటికీ, రోహిత్ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. గత మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరిగిన తర్వాత అతను ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: