📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Ram Gopal Varma: చిరంజీవికి RGV క్షమాపణలు.. ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Ram Gopal Varma

టాలీవుడ్‌లో కొత్త తరహా సినిమా స్టైల్‌ను చూపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన సంచలన చిత్రం ‘శివ’ రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీ గా ఉన్నాడు.. అక్కినేని నాగార్జున కెరీర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఈ ఐకానిక్ సినిమా మళ్లీ థియేటర్లలో నవంబర్ 14న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వర్మ, హీరో నాగార్జున ఇద్దరూ కలిసి ప్రేక్షకులతో మమేకమవుతూ, సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

Read Also: Gouri Kishan: నటి పై బాడీ షేమింగ్.. క్షమాపణలు చెప్పిన రిపోర్టర్

ఇక టాలీవుడ్ హీరోలు కూడా శివ-4k సినిమా రిలీజ్ ను పురస్కరించుకుని ఆల్‌ద బెస్ట్‌ చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు ఇప్పటికే వీడియోలు వదిలారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా శివ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. ‘శివ సినిమా చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను.

అది సినిమా కాదు. ఒక విప్లవం. ఒక ట్రెండ్‌ సెట్టర్‌. శివ (Siva movie) తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పింది. ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఆ సైకిల్‌ చైన్‌ సీన్‌ అయితే ఇప్పటికీ జనాల మనసుల్లో అలాగే నిలిచిపోయింది. నాగార్జున ఇంటెన్స్ యాక్టింగ్, ఎనర్జీ ఫెంటాస్టిక్. అమల, రఘువరన్‌.. ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్‌కి ప్రాణం పోశారు.

తెలుగు సినిమా భవిష్యత్ అని అనిపించింది

ఈ మూవీ రీ-రిలీజ్ అవుతుందని తెలిసి సంతోషించాను. నేటి తరానికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి. ఇదో టైమ్‌ లెస్ ఫిల్మ్.. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విజన్, కెమెరా యాంగిల్స్ చాలా కొత్తగా అనిపించాయి. ఈ యువ దర్శకుడు, తెలుగు సినిమా భవిష్యత్ అని అనిపించింది. హ్యాట్సాఫ్ టు రామ్ గోపాల్ వర్మ.. తెలుగు సినిమా ఉన్నంత కాలం శివ, చిరంజీవిలా చిరకాలం ఉంటుంది..’ అంటూ విషెస్ చెప్పారు చిరంజీవి.

ఇప్పుడు ఇదే వీడియోపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. చిరంజీవి వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేసిన ఆర్జీవీ.. ‘థ్యాంక్యూ చిరంజీవి గారు.. ఈ సందర్భంగా మీకు క్షమాపణలు చెబుతున్నా.. అనుకోకుండా నా మాటలు, చేతలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి.. మీ పెద్ద మనసుకి థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chiranjeevi latest news nagarjuna Ram Gopal Varma Shiva 4K Re Release Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.