టాలీవుడ్‌లో తన ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను అలరిస్తూ వస్తున్న రామ్ పోతినేని (Ram Pothineni) మరోసారి పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నాడు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పి. మహేష్ బాబు తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. పక్కా మాస్, హై ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
Read Also: Varanasi Title: రాజమౌళి-మహేష్ బాబు ‘వారణాసి’ టైటిల్ వివాదం
ట్రైలర్ విడుదల
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ (Mythri Movie Makers banner) పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రంలో రామ్ (Ram Pothineni).. ఒక సూపర్ స్టార్‌కి వీరాభిమానిగా కనిపించనున్నారు.
కన్నడ స్టార్ ఉపేంద్ర గారు పోషించిన ‘ఆంధ్రా కింగ్’ పాత్రకు రామ్ ఎంతటి డైహార్డ్ ఫ్యాన్ అనే అంశాన్ని ట్రైలర్ హైలైట్ చేసింది. రామ్ పోతినేని ఎనర్జీ, మాస్ డైలాగ్స్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు.రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: